ప్చ్..’సలార్’ లో ప్రభాస్ ని చూపించింది కేవలం ఇంతసేపే..

రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్న మాసివ్ ప్రాజెక్ట్ “సలార్”. హీరో ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ వర్క్ చేసాడు. అయితే ఈ సినిమా వచ్చి నాలుగు రోజులు కంప్లీట్ కాగా ఈ సినిమా చూసిన తర్వాత చాలా మందికి మెయిన్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి.

మరి ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా తమ హీరోని స్క్రీన్ పై ఎక్కువ సేపు చూడాలి అనుకుంటారు. కానీ సలార్ లో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ టెస్ట్ పెట్టాడు. సినిమాలో ప్రభాస్ పై సీన్స్ నిజానికి చాలా తక్కువ ఉంటాయి అని చెప్పాలి. ఈ సినిమా టోటల్ రన్ టైం 2 గంటల 55 నిమిషాలు అయితే ఈ రెండు 55 నిమిషాల్లో ప్రభాస్ కనిపించేది కేవలం 60 నిమిషాల మేర మాత్రమే అట.

ఇది ఒకింత షాకింగ్ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ చాలా వరకు ప్రభాస్ పై సీన్స్ మిస్ చేసాడు కానీ చూపించిన కొన్ని సీన్స్ అయినా మరో లెవెల్లో చూపించాడు అని చెప్పాలి. మెయిన్ గా సెకండాఫ్ లో అయితే చాలా సేపటి వరకు కూడా ప్రభాస్ కనిపించడు.

ఇలా మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం ప్రశాంత్ నీల్ కాస్త డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చాడు అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా శ్రేయ రెడ్డి, పృథ్వీ రాజ్, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.