ప్రభాస్ అందరికీ సుపరిచితుడు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు ఇతని స్వగ్రామం. ఈయన చదువు అంత భీమవరంలో కొనసాగింది, తర్వాత బీటెక్ హైదరాబాదులో పూర్తి చేశాడు. ఇతడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలో అడుగు వేశాడు.
తర్వాత వర్షం, ఛత్రపతి,బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో తన క్రేజ్ ప్రపంచ స్థాయికి ఎదిగింది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ పేరే మొదట వినిపిస్తుంది.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు ఏ అమ్మాయిని చేసుకుంటాడు అని అభిమానులే కాదు, కుటుంబ సభ్యులు కూడా ఎదురుచూస్తున్నారు. ఒకసారి మీడియా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా తాను పెళ్లి చూసుకుంటే చూడాలని తన పిల్లలతో ఆడుకోవాలని ఉందని తన మనసులోని మాట చెప్పారు. అయితే ఈమధ్య ఒక పారిశ్రామికవేత కూతురితో ఘనంగా నిశ్చితార్థం జరిగిందని వార్తలు వస్తున్నాయి.
అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తుంది. పెళ్లి మాత్రం ఘనంగా రాజస్థాన్ లో జరగబోతుందని సమాచారం. మొత్తానికి ఈ ఫోటోలు లీకై నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మొత్తం మీద మన ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.