ప్రభాస్, గోపీచంద్ ముల్టీస్టారర్?

ఒకప్పుడంటే టాలీవుడ్ లో ముల్టీస్టారర్ సినిమాలు అరుదుగా వచ్చేవి, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ లు కూడా ముల్టీస్టారర్ లు చెయ్యడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని ముల్టీస్టారర్ సినిమాలు మొదలయ్యి, కొన్ని మొదలవకుండానే కూడా ఆగిపోయాయి.

అప్పట్లో నాగార్జున, రాజశేఖర్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడు ఈ వి వి సత్యనారాయణ  కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అలాగే ఉదయ్ కిరణ్, తరుణ్ హీరోలుగా రవి బాబు ఒక సినిమా ప్లాన్ చేసాడు, కానీ ఉదయ్ కిరణ్ లాస్ట్ మూమెంట్ లో తప్పుకోవడంతో బాలీవుడ్ నటుడితో ‘సోగ్గాడు’ సినిమా చేసాడు రవి బాబు. కే రాఘవేంద్ర రావు కూడా తన వందవ సినిమాను నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లు హీరోలు గా అనుకుని స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేసాడు, కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా మొదలవ్వలేదు.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్నాళ్ల క్రితం పూరి జగన్నాధ్ ప్రభాస్, గోపీచంద్ హీరోలుగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘షోలే’ ని తెలుగు లో రీమేక్ చెయ్యాలని అనుకున్నాడంట, కానీ ఆ సినిమా మొదలవ్వలేదు. ప్రభాస్, గోపీచంద్ ‘వర్షం’ సినిమాలో కలిసి నటించారు, ఆ తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.