పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో వరుసగా రెండు భారీ సర్ ప్రైజ్ లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఆమెరికా శాన్ డీగో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. అంతర్జాతీయ వేదికపై ఓ సినిమా ప్రమోషన్ కోసం రెండు సార్లు అక్కడికే వెళ్లిన తెలుగు నటుడు ప్రభాసే కావడం విశేషం.
అప్పట్లో ‘బాహుబలి’ కోసం ఇలానే చేశారు. అక్కడి ఓ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ఇలానే సినిమాకు సంబంధించి క్యారెక్టర్ స్కెచెస్ తో పాటు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ను అక్కడ ప్రదర్శన చేశారు. ఇకపోతే వాస్తవానికి ఇటీవలే ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ కోసం మూవీటీమ్ తో కలిసి వెళ్లబోతున్నారు. జులై 19న కామిక్ కాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇండియన్ సినిమా కల్చర్ ను రిప్రెజెంట్ చేస్తారట.
ఈ ప్రతిష్టాత్మక కామిక్ కాన్ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ తో పాటు యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కూడా హాజరు కానున్నారు. ఇక జులై 20న ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకలు జులై 23 వరకు జరగనున్నాయట. ఆ తర్వాత ప్రభాస్.. మిగతా మూవీటీమ్ తో కలిసి అక్కడి నుంచి జులై 23నే తిరిగివస్తారని సమాచారం అందింది.
దేశానికి తిరిగి రాగానే ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’ కు సంబంధించి మిగిలిన వర్క్ ను ప్రభాస్ పూర్తి చేయనున్నారు. అలాగే మారుతీ సినిమా కూడా పూర్తి చేసేందుకు డేట్స్ ఇవ్వనున్నారట. అలా ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ ప్రమోషన్స్ లో జోరు పెంచి .. సినిమాలను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేయనున్నారు. అలాగే అభిమానులు ఈ రెండు చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ‘సలార్’ రిలీజ్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ పృథ్వి రాజ్ సుకుమార్, జగపతి బాబు ప్రతినాయకులుగా నటించారు. శ్రుతిహాసన్ హీరోయిన్.’ ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.