ప్రభాస్, అనుష్క ల డి క్రేజీ కాంబినేషన్. ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ లాంటి సూపర్ హిట్స్ లో వీళ్లిద్దరు కలిసి నటించారు. ‘బాహుబలి’ షూటింగ్ టైం నుండి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చాలా వార్తలు వచ్చాయి….వస్తున్నాయి కూడా.
అయితే అలాంటిదేదీ లేదని ప్రభాస్, అనుష్క క్లారిటీ ఇచ్చారు. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఇప్పటి చెప్తూనే ఉన్నారు. అనుష్క అంటే చాలా వేల్యూ ఇచ్చే ప్రభాస్ ఒకానొక సందర్భం లో ఒక సినిమా విషయం లో ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడంట.
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క వేశ్య గా నటించింది. అయితే స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క ని ఆ రోల్ లో నటించొద్దని ప్రభాస్ చెప్పాడంట, కానీ స్క్రిప్ట్ నచ్చడం తో అనుష్క ఆ సినిమాలో నటించింది.
‘వేదం’ సినిమా ప్లాప్ అయినా కానీ ఆ సినిమాలో నటించిన అందరికి మంచి పేరు వచ్చింది. అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా లో దీక్ష సేథ్ హీరోయిన్ గా నటించింది.