“సలార్ 2” పై ప్రభాస్ నుంచే బిగ్ అప్డేట్.. 

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన సినిమాల్లో తెలుగు నుంచి అయితే కొన్ని సినిమాలే వచ్చాయి. ఇంకా వాటిలో పెద్ద సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం “సలార్” అనే చెపుకోవాలి. ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా తన మొదటి సినిమా ఉగ్రం కి రీమేక్ గా తాను తెరకెక్కించారు.

అయితే రిలీజ్ అయ్యాక సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకుంది. అయితే ఇది రిలీజ్ అయ్యింది. మేకర్స్ రెండో భాగాన్ని కూడా అనౌన్స్ చేసేసారు. కాగా రెండో పార్ట్ ని సలార్ శౌర్యంగ పర్వం గా అనౌన్స్ చేసారు కానీ మొదటి సినిమా బయటకి వచ్చిన తర్వాత పార్ట్ 2 కోసం ఎక్కడా అప్డేట్ ఇవ్వలేదు.

కాగా ఈ సినిమా ఎప్పుడు ఏంటి అనేవి మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. కాగా దీనిపై ఇప్పుడు స్వయంగా ప్రభాస్ నుంచే అప్డేట్ వచ్చేసింది. తాను ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఖచ్చితంగా సలార్ పార్ట్ 2 ఉంది కానీ పార్ట్ 2 ఇప్పుడప్పుడే స్టార్ట్ కాదని కన్ఫర్మ్ చేసాడు.

అంతే కాకుండా దానికి కథ కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉండగా తాము కూడా దాన్ని త్వరగానే ఫినిష్ చేయాలనీ చూస్తున్నాం ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మాకు కూడా తెలుసు వీటి అన్నింటిపై ఓరోజు క్లారిటీ తప్పకుండా ఇస్తామని ప్రభాస్ తెలిపాడు. దీనితో ఈ స్టేట్మెంట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ మారింది.