ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి , వస్తోంది బంగారం లాంటి అప్డేట్.

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రాధే శ్యామ్’. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సమ్యుక్తంగా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో సీనియర్ రెబల్ స్టార్ కూతురు ప్రశీద నిర్మాతగా మారుతోంది. కాగా ‘రాధే శ్యామ్’ నుంచి అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. భారీ అంచనాలు పెంచారు.

First look of Prabhas-starrer 'Radhe Shyam' released | The News Minute

అయితే ఆ తర్వాత నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ‘రాధే శ్యామ్’ నుంచి మళ్ళీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ‘రాధే శ్యామ్’ టీజర్ ని న్యూ ఇయర్ కానుకగా విడుదల చేస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురూ చూశారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి న్యూస్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కాని ప్రభాస్ లుక్ ని రిలీజ్ చేసి కాస్త ఊరట కలిగించారు మేకర్స్. కాగా దర్శకుడు రాధకృష్ణ త్వరలో ‘రాధే శ్యామ్’ టీజర్ అప్డేట్ వస్తుందని ట్వీట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ‘రాధే శ్యామ్’ టీమ్ స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నట్లు తాజా సమాచారం.

సంక్రాంతి కానుకగా ‘రాధే శ్యామ్’ నుంచి వీడియో టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారని లేటెస్ట్ అప్‌డేట్. మోషన్ పోస్టర్ లో కంప్లీట్ గా రొమాంటిక్ యాంగిల్ చూపించగా.. ఈ స్పెషల్ వీడియోలో యాక్షన్ ని కూడా చూపించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ లో ఆనందం పట్టలేనంతగా నిండిపోయిందట. కాగా రొమాంటిక్ లవ్ స్టోరీ అయినప్పటికీ యాక్షన్ కి కూడా పెద్ద పీట వేసి సినిమాను రెడీ చేస్తున్నారట. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.