చిరు చురకలు.. మరో కొత్త స్టేట్మెంట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ 

తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి చుట్టూతా ఇప్పుడు పాలిటిక్స్ అయితే తిరుగుతున్నాయి అని చెప్పాలి. రీసెంట్ గా టాలీవుడ్ లో చోటు చేసుకున్న పరిణామాలు కోసం అందరికీ తెలిసిందే. మరి ఇదిలా ఉండగా పవన్ బ్రో తో స్టార్ట్ అయ్యిన కాంట్రవర్సీ ఇప్పుడు మెగాస్టార్ దగ్గరకి వెళ్ళింది.

కొందరు రాజకీయ నాయకులూ తమ స్టేట్ లో మంచి పనులు చేయాల్సింది వదిలేసి మా సినీ సినీ పరిశ్రమ మీద పడతారు ఏంటండీ మీ పనులు మీరు చేస్తే ప్రజలే తలవంచి మొక్కుతారు అని చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. అయితే ఇదే వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయ వేడుకల నుంచి మెగాస్టార్ చేసిన మరో కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

“ఒకప్పుడు మేము అలా అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేనట్టే కదా” అంటూ చురకలు అంటించారు. అయితే ఇది చిరు ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్స్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదెలా అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పుడు పోస్ట్ బాహుబలి భారీ క్రేజ్ వచ్చింది.

దీనితో అందరి హీరోస్ ని మించి పెద్ద స్టార్ అయ్యాడు కానీ మిగతా హీరోస్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ఏమన్నా టాపిక్ లు వచ్చినపుడు అంతా ప్రభాస్ పాత సినిమాలు పోలుస్తునే చెప్తారు. అంటే ఇప్పుడు తమ హీరోస్ కన్నా ప్రభాస్ పెద్దవాడే కదా అని దీనిని స్వయంగా మెగాస్టార్ చెప్పినట్టే అని మెగాస్టార్ కి వారు అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో థాంక్స్ చెప్తూ వైరల్ చేస్తున్నారు.