ప్రభాస్ విషయంలో ఫ్యాన్స్ ఫన్నీ ఆవేదన.!

పాన్ ఇండియా మార్కెట్ లో సినిమాలకి గట్టి మార్కెట్ ఓపెన్ చేసిన వారిలో దర్శకుడు రాజమౌళి అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు ముందుంటారు. వారి చలవ బాహుబలి తోనే ఎన్నో సినిమాలు రాజమౌళి కన్నా దిగ్గజ దర్శకులు ధైర్యంగా తమ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసేందుకు సాహసం చేస్తున్నారు.

కాగా రాజమౌళి తన సినిమాల విషయంలో కేవలం తన సినిమా కోసమే ఎక్కువ తపిస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ విషయంలో అలా కాదు తన సినిమాల కోసం తప్ప మిగతా సినిమాల కోసం అప్డేట్ లు చిన్న చిన్న సినిమాలను సైతం మెచ్చుకోవడం వంటివి చేస్తాడు. దీనితో సదరు తన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా హీరో మా హీరో సినిమాల కోసం కాకుండా వేరే సినిమాల అప్డేట్స్ ఇచ్చే వాడిలా పరిస్థితి అయిపోయింది అంటూ తమ బాధ మింగలేక కక్కలేక చెప్పుకుంటున్నారు. దీనితో ఈ టాక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి ప్రభాస్ ఇకనైనా తన సినిమాల విషయంలో ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇస్తాడో లేదో చూడాలి.

కాగా ప్రభాస్ అయితే ఇప్పుడు నటించిన ఆదిపురుష్ అనే సినిమా భారీ ఎత్తున ఈ జూన్ 16న రిలీజ్ కాబోతుండగా  నెక్స్ట్ సలార్, ప్రాజెక్ట్ కే అనే సెన్సేషనల్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. దీనితో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో ప్రభాస్ హోరెత్తించానున్నాడు.