Radhe Shyam: రాధేశ్యామ్ ఫ్లాప్ అని ఆత్మహత్య చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్!

Radhe Shyam : సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు తెగ వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన నటీనటుల విషయంలో వాళ్లు చూపించే ప్రేమ, అభిమానంను చూస్తే షాకవ్వకుండా ఉండలేరు. ఇక కొందరు తమ అభిమాన హీరోల కోసం ప్రాణాలను కూడా అర్పిస్తుంటారు. అలా తాజాగా ప్రభాస్ ఫ్యాన్ కూడా ప్రాణాలను అర్పించాడు.

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా చూశాక నిరాశ కలగడంతో ఆయన అభిమానులు ఎంతో మంది ఫీల్ అయ్యారు. అందులో కర్నూలు జిల్లా తిలక్ నగర్ కు చెందిన రవితేజ అనే అభిమాని మాత్రం ఫ్లాప్ అని తట్టుకోకపోవడంతో.. తన తల్లితో చెప్పి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన అందరికీ బాధ కలిగిస్తుంది.