పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్-కె అని తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ కె అనేది వర్కింగ్ టైటిల్. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపిక పదుకొణె నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇటీవల ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనున్నట్లు అనౌన్స్ చేశారు. అంటే జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్లాన్‌లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి కాకుండా.. పోటీ లేకుండా విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పోటీ ఉండకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
‘ప్రాజెక్ట్-కె’ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా చిత్రీకరణ 70శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో పాటు, దీపిక, అమితాబ్ లకు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండనుందట. చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురూ కనిపిస్తారని టాక్. ప్రేక్షకులు ఇప్పటివరకూ చెందని సరికొత్త అనుభూతిని ‘ప్రాజెక్ట్-కె’ ఇస్తుందని దర్శక నిర్మతలు చెబుతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఐదారు కంపెనీలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ప్రాజెక్ట్-కె వచ్చే ఏడాది సంక్రాంతికి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. చూడాలి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందోనని.