అఫీషియల్ : “ప్రాజెక్ట్ కే” తో చరిత్ర సృష్టించిన ప్రభాస్.!

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇపుడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా పలు భారీ చిత్రాలు చేస్తుండగా ఇప్పుడు అయితే ప్రభాస్ సినిమాల్లో వరల్డ్ లెవెల్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో ఐతే ఇప్పుడు చిత్ర యూనిట్ చరిత్ర సృష్టించారు.

అలాగే ఈ భారీ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఒక బిగ్ అప్డేట్ ని చాలా ప్రైడ్ గా రివీల్ చేసారు. అయితే ఇది వరకే యూఎస్ లో జరిగే ఓ ఈవెంట్ లో అయితే ఈ చిత్రంపై పలు ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని రివీల్ చేస్తారని టాక్ రాగ ఇప్పుడు ఇది అఫీషియల్ అయ్యింది.

ప్రముఖ సాన్ డైగో కామిక్ కాం ఇంటర్నేషనల్ ఈవెంట్ లో అయితే పలు భారీ హాలీవుడ్ చిత్రాలతో పాటుగా ప్రాజెక్ట్ కే ని కూడా స్పెషల్ ఫీచర్స్ స్క్రీనింగ్ ని చేయనున్నారట. మరి ఇలా చేస్తున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఇప్పుడు ప్రాజెక్ట్ కే నిలవగా ఈ రకంగా చరిత్ర సృష్టించిన ఏకైక ఇండియన్ హీరోగా అయితే ప్రభాస్ నిలిచాడు.

దీనితో ఈ అంశాన్ని సినిమా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఎంతో గర్వంగా అయితే తెలిపాడు. ఇక ఈ భారీ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటాని అలాగే మరి సంచలన నటులు ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు అయితే నటిస్తున్నారు. అలాగే ఈ ప్రముఖ ఈవెంట్ అయితే ఈ జూలై 20న జరగబోతుంది.