వైరల్ : రాజమౌళికే కౌంటర్ ఏసిన ప్రభాస్??

తన అన్నేళ్ల కష్టంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ చిత్రం “బాహుబలి” సిరీస్ ఎలా తన ఫేట్ ని మార్చిందో తెలుగు స్టేట్స్ ప్రజలకే కాకుండా పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. మరి ఆ చిత్రాన్ని తెరకెక్కించింది రాజమౌళి కాగా తనతో పాటుగా తనని నమ్మిన ప్రభాస్ ని ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ స్టార్ గా అయితే నిలబెట్టాడు.

మరి ఇంత లైఫ్ ఇచ్చిన రాజమౌళినే ప్రభాస్ పక్కన పెట్టడం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఈ 21 ఏళ్ల సినీ కెరీర్ లో తనకి ది బెస్ట్ దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రశాంత్ నీల్ అని చెప్పడం చాలా మందికి షాకింగ్ గా మారింది.

సలార్ సినిమా చేస్తున్న సమయంలో తాము చాలా దగ్గరయ్యాం అని మా ఇద్దరి మధ్య ట్రావెల్ లో కేవలం ఒక్క నెలలోనే మంచి బాండింగ్ ఏర్పడింది అని చెప్పాడు. దీనితో ఈ కౌంటర్ రాజమౌళికే వేసినట్టు ఉందని కొందరు సోషల్ మీడియాలో అంటున్నారు.

ఎందుకంటే పోస్ట్ బాహుబలి సినిమా ప్రభాస్ సినిమాల కోసం రాజమౌళి మాట్లాడింది పెద్దగా ఏమి లేదు తన సపోర్ట్ ఇచ్చింది లేదు. కానీ తన సినిమాలకి బాగానే ప్రభాస్ ని వాడుకున్నాడు. దీనితో ఇదొక కారణం కూడా కావచ్చని కొందరు అంటున్నారు.