సలార్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది..అప్పుడే లీకులు మొదలు..!

సలార్ .. పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ – కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. కేజీఎఫ్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చిన సలార్ ఫస్ట్ షెడ్యూల్ తెలంగాణ లోని రామగుండం కోల్ మైన్స్ లో ప్రారంభం అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత పాన్ ఇండియా రేంజ్ సినిమాలని భారీ ప్రాజెక్ట్స్ ని మాత్రమే కమిటవుతున్నాడు. ప్రభాస్ కెరీర్ లో భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న సలార్ మీద ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత రెట్టింపు చేస్తుంది తాజాగా లొకేషన్ నుంచి లీకైన ఫొటో.

ఫస్ట్ షెడ్యూల్ 10 రోజులు పాటు సాగనుండగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో పాటు ఫైటర్స్ మీద భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడట. ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ ఇంట్రడక్షన్స్ అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ ఒక్క ఇంట్రడక్షన్ సీన్ కే భారీ బడ్జెట్ ని కేటాయించారు అని చెప్పుకుంటున్నారు. ఇక లీకైన ఫొటో చూస్తుంటే ప్రభాస్ క్యారెక్టర్ మెకానిక్ అని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని సలార్ మీద అంచనాలు మాత్రం పీక్స్ కి చేరుకున్నాయి. ఇక సలార్ లో 5-6 భారీ యాక్షన్స్ సీన్స్ ఉంటాయని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ షెడ్యూల్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ శృతిహాసన్ కూడా పాల్గొంటుందని తెలుస్తోంది. ఇక ఈ 10 రోజుల షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట. కాగా సలార్ సినిమాని 4 నెలల్లో టాకీ పార్ట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు షూటింగ్ తో పాటు మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుగుతోందట. వీఎఫెక్స్ వర్క్ పెద్దగా లేకపోవడం తో వీలైనంత త్వరగా సలార్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ లో సలార్ ని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని అంటున్నారు. ఇక రాధే శ్యాం కూడా మే లేదా జూన్ లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.