బీట్స్ ఆఫ్ ‘రాధేశ్యామ్’లో ఇవి గమనించారా?.. మొత్తానికి కాన్సెప్ట్ అలా లీకైంది!

రాధేశ్యామ్ సినిమాలో ఓ ముఖ్యమైన పాయింట్ దొరికినట్టు కనిపిస్తోంది. మామూలుగా రాధేశ్యామ్ చిత్రం పీరియాడిక్ లవ్ డ్రామా అని తెలిసిందే. అందుకే ప్రేమకు చిహ్నంగా నిలిచే ఇటలీ వంటి నగరంలో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. మొదటగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌లోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ఇదొక లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా అని చెప్పేశారు.
ఇక మొన్న పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Prabhas Beats Of RadheShyam Poster goes viral,RadheShyam
Prabhas Beats Of RadheShyam Poster goes viral,RadheShyam

ప్రేరణ అంటూ నవ్వుతున్న పూజా హెగ్డే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో పూజా హెగ్డే ట్రెయిన్‌లో ప్రయాణం చేస్తూ.. తోటి ప్రయాణికులతో ముచ్చట్లు పెడుతూ సరదాగా నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక నేడు బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ట్రెయిన్ ఉంది. పైగా ట్రెయిన్ నుంచి వచ్చిన పొగ మేఘాల రూపంలో మారిపోయింది. ఇలా మొత్తానికి ఈ పోస్టర్లు, ఆ ట్రెయిన్ చూస్తుంటే రాధేశ్యామ్‌లో ఇది ఏదేదో మెయిన్ రోల్‌ను పోషించేలానే ఉంది.

Prabhas Beats Of RadheShyam Poster goes viral,RadheShyam
Prabhas Beats Of RadheShyam Poster goes viral,RadheShyam

ప్రభాస్, పూజా హెగ్డేలు ఈ ట్రెయిన్‌లో పరిచయమవుతారో, వారిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి ఈ ట్రైన్ ప్రయాణం ఏదైనా కారణం కావొచ్చేమో. మొత్తానికి బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ ప్రభాస్ బర్త్ డే రోజున మంచి ప్లానే వేశారు. అయితే ఈ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ దాహాన్ని తీర్చుతుందో లేదో చూడాలి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు.