ఆదిపురుష్‌లో రాముడిగా ప్ర‌భాస్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్న ఫొటో

బాహుబ‌లి సినిమాతో అభిమానుల అంచ‌నాల‌ను ఓ రేంజ్‌లో పెంచేసిన ప్ర‌భాస్ ఆ అంచ‌నాల‌కు త‌గ్గకుండా సినిమాలు చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఇటీవ‌లే రాధేశ్యామ్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న‌ ‘ఆదిపురుష్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాడు. తొలిసారి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఆదిపురుష్ అనే సినిమాని భారీ బ‌డ్జెట్‌తో చేస్తున్న నేప‌థ్యంలో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి.

పౌరాణిక నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్‌ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించనున్నారని, రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్నారు. ప్ర‌భాస్ రాముడిగా న‌టించ‌నున్నాడ‌నే వార్త ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఇక అభిమానులు వారికి న‌చ్చిన‌ట్టు ఊహించుకోవ‌డం మొద‌లు పెట్టారు. కొంద‌రైతే త‌మ టాలెంట్‌కు ప‌దును పెట్టి ప్ర‌భాస్‌ని రాముడి గెట‌ప్‌లో అందంగా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఓ అభిమాని ప్ర‌భాస్ రాముడిగా ఉంటే ఎలా ఉంటుందో అని యానిమేష‌న్ లుక్ త‌యారు చేశాడు. ఈ పోస్ట‌ర్‌కి ద‌ర్శకుడు కూడా ఫిదా కావ‌డం విశేషం.

ఆదిపురుష్ చిత్ర ద‌ర్శ‌కుడు ఓం రౌత్ త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌భాస్ ఫ్యాన్స్ మేడ్ పోస్ట‌ర్స్ షేర్ చేస్తూ.. మీరు త‌యారు చేసిన పోస్ట‌ర్ చూసి షాక్ అయ్యాను. మీకు చాలా స‌త్తా ఉంద‌ని కామెంట్ పెట్టారు. అయితే రాముడి లుక్‌లో ప్రభాస్ భారీ కండ‌ల‌తో సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌ని చూసి ప్ర‌భాస్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. చిత్రంలో అనుష్క శ‌ర్మ క‌థానాయిక అని తెలుస్తుండ‌గా, కృష్ణం రాజు ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం