రాజమౌళి దర్శకత్వంలో ప్రబాస్.?

ప్రబాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయ్. అన్నీ ప్రెస్టీజియస్ సినిమాలే. ప్యాన్ ఇండియా పేరున్న సినిమాలే. కానీ, ఎందుకో తెలీదు వాటిపై హైప్ రావడం లేదు.

‘బాహుబలి’తో దక్కించుకున్న ప్యాన్ ఇండియా ఇమేజ్‌ని ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో ప్రబాస్ కోల్పోయాడనే అంటున్నారు. మళ్లీ ఆ క్రేజ్ రావాలంటే, ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ రావాలి. అదీ రాజమౌళి వంటి దర్శకుడి వల్లే సాధ్యమవుతుంది.. అని ప్రబాస్ అభిమానులు అనుకుంటున్నారట.

ప్రబాస్ కూడా అదే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. మే, జూన్ నెలల్లో ప్రబాస్ నుంచి ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ రానుందనీ తెలుస్తోంది. అలాంటిదేదో జరిగితే కానీ, ప్రబాస్ నటిస్తున్న ‘ఆది పురుష్’ తదితర ప్రస్తుత ప్రాజెక్టులకు ఊపు రాదు.

అయితే, రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా కోసం సంసిద్ధమవుతున్నాడు. ఏమో, ప్రబాస్ కోసం రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రబాస్‌తో అలాంటి మ్యాజికల్ అనౌన్స్‌మెంట్ ఏమైనా చేస్తాడేమో చూడాలి మరి.