ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర గట్టిగా వినిపిస్తున్న సినిమా పేరు లియో కాగా ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మరింత స్థాయిలో వినిపిస్తుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో లోకేష్ ఇస్తున్న ఒకో అప్డేట్ తో అయితే ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నాడు.
అయితే లోకేష్ కనగ రాజ్ తన కెరీర్ లో కేవలం కొన్ని చిత్రాలు మాత్రమే చేస్తానని తర్వాత డైరెక్షన్ చేయడం ఆపేస్తానని కన్ఫర్మ్ చేసాడు. కాగా లోకేష్ కనగ రాజ్ చిత్రాల్లో అయితే మన టాలీవుడ్ నుంచి కూడా హీరోలు తో సినిమాలు ఉన్నాయని తెలిసిందే.
కాగా ఈ హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఉండగా ప్రభాస్ తో సినిమా కోసం ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. దీనితో అయితే ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్ తాలూకా లాస్ట్ చిత్రంగా ఉండబోతుందట. ఇప్పటికే లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో అనేక చిత్రాలు చేస్తుండగా ప్రభాస్ తో చేసే సినిమా మాత్రం ఈ యూనిరవ్స్ అంతటికీ కూడా ఒక ఎండింగ్ సినిమాగా ఉంటుంది అని న్యూస్ వినిపిస్తుంది.
దీనితో అసలు ప్రభాస్ తో తన సినిమాటిక్ యూనివర్స్ కి ఎండింగ్ ఇవ్వడం అనేది ఓ బిగ్ థింగ్ అని చెప్పాలి. ఇప్పటికే కమల్, సూర్య విజయ్ దళపతి తో సినిమాలు చేస్తున్న లోకేష్ తన లాస్ట్ సినిమాగా అందులోని కనెక్షన్ గా భారీ చిత్రం ప్రభాస్ తో ఎండ్ చేయడం అనేది ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అని చెప్పాలి.