ప్రభాస్ ఆది పురుష్ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సమస్థ.. ఎన్నికోట్లతో తెలుసా?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తన సినిమాలన్నింటినీ పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా రామాయణం నేపథ్యంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా షూటింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే ఈ సినిమా తెలుగు రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ బ్యానర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 100 కోట్ల రూపాయలకు ఈ సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సమస్థ నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలలో కలిపి ఏకంగా 250 కోట్లకు పైగా చెల్లించారని సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోయినా ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకి వంటి సినిమా షూటింగులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.