Prabhas: దీపావళి కానుకగా ప్రభాస్ ఆది పురుష్… క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Prabhas: ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు. మొదట ఆదిపురుష్ చిత్రం ఆగష్టు 11 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించిన తరువాత వాయిదా వేశారు. అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా సోషల్ డ్రామాగా రానుంది. ఈ సినిమాను ఆగష్టు 11 న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.అలాగే ఆదిపురుష్ చిత్ర బృందానికి వారి సినిమా వాయిదా వేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఆదిపురుష్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయిన చిత్రాన్ని దీపావళి వారంతంలో విడుదల చేయవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చిత్ర దర్శకుడు భూషణ్ కుమార్ ఇంకా విడుదల తేదిని అనుకోలేదని దీపావళి రేస్ లో చాలా చిత్రాలు ఉన్నాయని అందుకే ఇంకా చిత్ర విడుదలను నిర్ణయించలేదని చెప్పారు. ఆదిపురుష్ సినిమా ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమా. చిత్రంలో 90% VFX గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ అభిమానులు మాత్రం ఆదిపురుష్ కోసం ఆతృత గా ఎదురుచూస్తున్నారు.