Prabhas : ఈ స్థాయిలో ప్రభాస్ కే సాధ్యం అని మళ్ళీ ప్రూవ్ అయ్యింది.!

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గా నిలిపింది మాత్రం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాత్రమే అని చెప్పాలి. కానీ ఆ తర్వాత తన స్టార్డం ని కాపాడుకుంటూ వచ్చింది మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి. తనదైన సినిమాల ఎంపికతో పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులని నిరాశపరచకుండా ప్రభాస్ వస్తున్నాడు.

అయితే ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంది? తనకి ఇంకా రాజమౌళి స్టాంప్ అవసరం ఉందా అనే అనుమానాలకు సమాధానం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ పేరు సమాధానం ఇచ్చింది అని చెప్పాలి. తన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించింది ఇంత క్రేజ్ తెచ్చుకోవడానికి కారణం ప్రభాస్.

మరి ఈ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చెయ్యగా దానిని ఏకంగా 64 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది చిన్న విషయం కాదు మొన్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అందులోని రాజమౌళి తీసిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ట్రైలర్ కే ఈ స్థాయి రెస్పాన్స్ రాలేదు. అంటే ప్రభాస్ క్రేజ్ ఎంతలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

దీనిని బట్టి ఇక మీదట ప్రభాస్ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ల ఇంపాక్ట్ కూడా అంతకు మించే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.