Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ వయస్సు పైబడుతున్న కొద్దీ నేటి హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ చిత్రాన్ని చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ ఆస్పత్రిలో కనిపించడంతో ఆయనకు ఏమైంది అంటూ ఆరా తీయగా ఆయన మోకాలికి సర్జరీ నిర్వహిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు ఆందోళన చెందారు. గతంలో కూడా అఖండ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన బాలకృష్ణ చేతికి సర్జరీ చేయించుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈయన మోకాలు సర్జరీ అనే విషయం తెలియగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విధంగా బాలకృష్ణ మోకాలి సర్జరీ గురించి వార్తలు షికార్లు చేయడంతో వెంటనే బాలకృష్ణ పిఆర్ టీమ్ స్పందించి బాలకృష్ణ సర్జరీ గురించి వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.బాలకృష్ణ గారికి ఏ విధమైనటువంటి సర్జరీ జరగలేదని కేవలం జనరల్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వచ్చారని పిఆర్ టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం బాలకృష్ణ సారథి స్టూడియోలో ఉన్నారని, బాలకృష్ణ పిఆర్ టీమ్ వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.