పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకాలు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా, సినిమాల కలెక్షన్ల ద్వారా ట్రెండ్ ను సెట్ చేసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చి ఏపీ అభివృద్ది కోసం శ్రమించాలని అనుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకాలలో నెల్లూరు చేపల పులుసు ఒకటి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాటుకోడి పులుసును సైతం ఎంతో ఇష్టంగా తింటారు. అరటికాయ వేపుడు, లెమన్ రైస్, పప్పు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకాలలో ఉన్నాయి. ఈ వంటకాలను రుచి చూసే ఛాన్స్ వస్తే పవన్ అస్సలు వదిలిపెట్టరని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో పవన్ సంతృప్తితో లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హరిహర వీరమల్లు కాస్టూమ్స్, సెట్స్ సైతం పవన్ కళ్యాణ్ ను అసంతృప్తికి గురి చేశాయని సమాచారం అందుతోంది. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. క్రిష్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు ప్రేక్షకులకు తెలిసే అవకాశాలు ఉంటాయి. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే పవన్ నటించిన ఒక్క సినిమా కూడా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సాధించలేదు.

పవన్ రెండు ప్రాజెక్ట్ లు కూడా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ సినిమాలలో వినోదాయ సిత్తం రీమేక్ కు పవన్ ఇరవై రోజుల డేట్లు కేటాయిస్తే సరిపోతుందని సమాచారం అందుతోంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు మాత్రం పవన్ ఎక్కువ రోజులు డేట్లు కేటాయించాల్సి ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.