Ram Pothineni: రామ్ పోతినేని అంటే టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో అని మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రామ్ డబ్బింగ్ సినిమాలకు హిందీలో బాగా క్రేజ్ ఉంది.
హిందీలో డైరెక్ట్ ఫిల్మ్ చేయకపోయినా రామ్ కు హిందీ లో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. మాస్ యాక్షన్ చిత్రాలు కావడంతో రామ్ సినిమాలకు ఉత్తరాదిన ఆదరణ బాగుంది. తెలుగులో నటించిన దాదాపు అన్ని సినిమా లను హిందీలో డబ్బింగ్ చేసి అక్కడ ప్రేక్షకులకు రామ్ ను దగ్గర చేసారు.
ఇటీవల ఎవరు సాధించని ఒక అరుదైన రికార్డ్ ను రామ్ సొంతం చేసుకున్నాడు.హిందీలో 2 బిలియన్ వ్యూస్ సాధించిన దక్షిణాది మొదటి హీరో గా రామ్ నిలిచాడు. యూట్యూబ్ లో రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలన్ని 2మిలియన్ వ్యూస్ సాధించడం మరో విశేషం.
దేవదాసు -సబ్సే బడా దిల్వాలా – 32M (బహుళ ఛానల్ అప్‌లోడ్‌లు)
జగడం – డేంజరస్ ఖిలాడీ రిటర్న్స్ – 31M
మస్కా – ఫూల్ ఔర్ కాంటే – 25M (రెండు ఛానెల్‌లు)
రామ రామ కృష్ణ కృష్ణ – నఫ్రత్ కి జంగ్ – 16M (రెండు ఛానెల్‌లు)
గణేష్ – క్షత్రియ ఏక్ యోద్ధా – 207M (రెండు ఛానెల్‌లు)
కందిరీగ – డేంజరస్ ఖిలాడీ 4 – 25M (రెండు ఛానెల్‌లు)
ఎందుకంటే ప్రేమంట – డేంజరస్ ఖిలాడీ 5 – 12M
మసాలా – 50 ఛానల్ ఎమ్ )
పండగ చేస్కో – బిజినెస్ మ్యాన్ 2 – 23ఎం
నేను శైలజ – ది సూపర్ ఖిలాడీ 3 – 440ఎం
ఉన్నది ఒకటే జిందగీ – నం 1 దిల్వాలా – 317ఎం (రెండు ఛానల్స్)
హలో గురు ప్రేమ కోసమే – ధూమ్‌దార్ ఖిలాడి – 404 ఎం సత్యమార్ 1 ఎమ్ శంకర్
హైపర్ – 2 ఎమ్ సత్యమూర్ కుమారుడు
ఇస్మార్ట్ శంకర్ – 255M
మొత్తం వ్యూస్ కలిపితే 2.07 బిలియన్ వ్యూస్.
ఇలా మొత్తం అన్ని సినిమాలకు ఉత్తరాదిన బాగానే క్రేజ్ ఉంది. అలాగే రామ్ హిందీ మార్కెట్ బాగానే పెరిగింది. దీంతో రామ్ తన తదుపరి చిత్రాలను ఇతర భాషలలోకి విడుదల చేయడానికి అనుగుణంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ ప్రస్తుతం నటిస్తున్న వారియర్ చిత్రం డబ్బింగ్ హక్కులు 16కోట్లకు అమ్ముడుపోయాయి.