భారీ ధరలకు సలార్ సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఛానల్?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు ప్రభాస్.బాహుబలి సినిమా తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సలార్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ చిత్రాన్ని కూడా కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకేకిస్తున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా శృతిహాసన్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే ఇది ప్రభాస్ తో తనకు మొదటి సినిమా కావడంతో శృతిహాసన్ కూడా ఈ సినిమాలో పాల్గొనడం ఎంతో ఎక్సైటింగ్ ఫీలవుతున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లోకేషన్ లో నుంచి ఎన్నో ఫోటోలు ఫైట్స్ సన్నివేషాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇది విన్నటువంటి ప్రభాస్ అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ సలార్ విషయంలో వచ్చిన అప్డేట్ ఏంటి అనే విషయానికి వస్తే ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ భారీ ధరలకు కైవసం చేసుకుందని తెలుస్తోంది.ఈ సినిమా సాటిలైట్ హక్కుల కోసం పలు చానల్స్ పోటీ పడగా ఎట్టకేలకు స్టార్ మా ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని ఇప్పటివరకు స్టార్ మా కొనుగోలు చేసిన సినిమాలలో హైయెస్ట్ బడ్జెట్ సలార్ కోసమే ఉపయోగించారని తెలియడంతో ప్రభాస్ మార్కెట్ చూసి అభిమానులు సైతం ఎంతో మురిసిపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.