ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ వివాదం.. పరోక్షంగా పూనమ్ కౌర్ కౌంటర్

Poonam Kaur satires On Prakash Raj Pawan Kalyan Issue

పూనమ్ కౌర్ తన ట్వీట్లతో ఎంతటి వివాదాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. తాను ఎవరిని ఉద్దేశించి ట్వీట్ వేస్తుందో అందరికీ అర్థమవుతుంది. కానీ ఎన్నడూ కూడా పలాన అని పేరు పెట్టి మాత్రం చెప్పదు. అయితే అందులో దాగి ఉన్న నిగూడార్థాలు, వారి పేర్లు మాత్రం జనాలకు ఇట్టే అర్థమవుతాయి. తాజాగా పూనమ్ కౌర్ ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై స్పందించింది. ప్రకాష్ రాజ్ ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనకు మద్దతు తెలుపుతూ తన సంఘీబావాన్ని ప్రకటించాడు.

Poonam Kaur satires On Prakash Raj Pawan Kalyan Issue
Poonam Kaur satires On Prakash Raj Pawan Kalyan Issue

అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్‌పై పూనమ్ కౌర్ స్పందించింది. ప్రకాష్ రాజ్ సర్ ఎప్పుడైనా ఏ యాక్టర్, పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడితే పెద్ద పెద్ద హెడ్ లైన్లు వేసి చూపిస్తారు.. కానీ ఆయన రైతుల గురించి ఎలాంటి పక్షపాతం లేకుండా మాట్లాడితే మాత్రం కవర్ చేశారు.. అంటూ మండిపడింది. తాను కూడా రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొంది. రైతుల బాధలను వినండని కోరింది. అయితే ఈ ట్వీట్‌లో యాక్టర్, పొలిటికల్ లీడర్ అంటే అది పవన్ కళ్యాణ్ అని ఇట్టే తెలిసిపోతోంది.

ఎందుకంటే రీసెంట్‌గా ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా విమర్శించిన సంగతితెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను ఊసరవెల్లి అంటూ సంబోధించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇదే విషయాన్ని పూనమ్ ప్రస్తావించింది. ప్రకాష్ రాజ్ అలాంటి మాట్లాడితే కవర్ చేసే మీడియా.. రైతుల గురించి మాట్లాడితే ఎందుకు చేయదంటూ ప్రశ్నించింది. ఏది ఏమైనా ప్రస్తుతం పూనమ్ వేసిన ట్వీట్ కూడా బాగానే వైరల్ అవుతోంది.