బాస్ బ్యూటీకి టాలీవుడ్‌లో బంపర్ ఆపర్.?

బాస్ బ్యూటీ అంటే, బిగ్ బాస్ బ్యూటీస్ గురించి కాదు.. అక్కినేని నాగార్జున హీరోగా చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘బాస్’ సినిమా గుర్తుందా.? అందులో అక్కినేని నాగార్జున సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తే, ఆ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించింది బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా.

అడపా దడపా న్యూ ఇయర్ ఈవెంట్ల సందర్భంగా మాత్రమే తెలుగు మీడియాలో పూనమ్ బజ్వా పేరు వినిపిస్తుంటుంది.. ఆయా సందర్భాల్లోనే హైద్రాబాద్‌లో కనిపిస్తుంటుంది బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా.

గత కొంతకాలంగా ఆమె తమిళ సినిమాలకే ఎక్కువగా ఫిక్సయిపోయింది. తాజాగా, ఈ బ్యూటీకి టాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. ఓ యంగ్ హీరో నటిస్తోన్న సినిమాలో ఈ బ్యూటీకి కీలకమైన పాత్ర దక్కిందనీ, ఆపాత్ర కోసం ఆమె కాస్త సన్నబడే ప్రయత్నాల్లో వుందనీ తెలుస్తోంది.

నెగెటివ్ షేడ్స్ వున్న ఆ పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టబోతోందట. ఆ యంగ్ హీరో ఎవరు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓ ప్రముఖ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడట.