సీతారామం వంటి హిట్ సినిమాని మిస్ చేసుకున్న పూజ.. రిజెక్ట్ చేయడానికి ఇదే కారణమా?

సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటుంది. అయితే ఈమెకు ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం వంటి బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.

తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో విడుదలైన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం ముందుగా పూజా హెగ్డేకి వచ్చింది.ఈ సినిమా కథ విన్న ఈమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేసి ఫ్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేశారు. ఇక సినిమా ప్రారంభమవుతున్న సమయంలో పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు.

అయితే ఈమెకు కరోనా నుంచి కోలుకోవడానికి ఆలస్యం అవుతుందని తెలియడమే కాకుండా మరోవైపు కాస్టింగ్ కాస్ట్ కూడా పెరిగిపోవడంతో నిర్మాతలు పూజా హెగ్డేను కాకుండా ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ స్థానంలో కనుక పూజా హెగ్డే నటించి ఉంటే ఫ్లాప్ సినిమాలకు బ్రేక్ వేసినట్టు అయ్యేది.ఇలాంటి ఒక మంచి సినిమాని పూజా హెగ్డే నిజంగానే మిస్ చేసుకుందని చెప్పాలి.