టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పూజా హెగ్డేకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ మధ్య సమంతపై చేసిన కామెంట్స్ ఆ తరువాత అకౌంట్ హ్యాక్ అయిందని నాటకాలు ఆడటంతో మీడియాలో హల్చల్ చేసింది. ఆ సమయంలో పూజా హెగ్డే విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. మళ్లీ ఆ రేంజ్ ట్రోలింగ్‌ను ఈ మధ్యే చవిచూసింది.
దక్షిణాది, తెలుగు ప్రేక్షకులు నడుము మోజులో ఉంటారని వారికి అవి చూపిస్తే చాలు అని చెప్పుకొచ్చింది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని లేపాయి. పూజా హెగ్డే తన ఇమేజ్‌కు జరుగుతున్న డ్యామేజ్‌ను గుర్తించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఓ సందర్భంలో అన్న మాటలు వేరేలా అర్థం చేసుకుంటున్నారు.. మాటలు మార్చగలరు అభిమానాన్ని కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ రుణపడే ఉంటాను అని పూజా హగ్డే చెప్పుకొచ్చింది.
తాజాగా పూజా హగ్డే మళ్లీ వార్తల్లో నిలిచింది. ఓ బుల్లి అభిమాని మాటలకు ఫిదా అయిన పూజా హెగ్డే చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్న పాప తాను పెద్దయ్యాక హీరోయిన్ పూజా హెగ్డే అవుతానని ఎంతో ముద్దుగా చెప్పింది. ఆవీడియోను చూసిన పూజా హెగ్డే తెగ సంబరపడుతూ.. దేవుడా.. ఈ చిన్న క్యూట్ పాప నా రోజును సంతోషకరంగా మార్చేసింది.. ఆ బుగ్గలు ఎంత బాగున్నాయో.. ఇంతటి క్యూట్ బుగ్గలు ఎప్పుడూ చూడలేదు.. నీకు నా ప్రేమను, ముద్దులను పంపుతున్నాను.. నిన్ను కలుస్తానని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.