ఈరోజు ఇలా ఉండటానికి కారణం విధి రాతే అంటున్న పూజా హెగ్డే!

టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇటీవలే ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జాతకాలు, విధిరాత అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. పైగా ప్రభాస్ పామిస్ట్ గా నటించాడు. ఇక ఈ సినిమా విడుదలైన సందర్భంగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో తనకు జాతకాల గురించి, విధిరాత గురించి ప్రశ్న ఎదురవడంతో.. తాను విధిని ఎక్కువగా నమ్ముతానని తెలిపింది. తను ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగానని.. తన ఫ్యామిలీ అంతా చదువుకున్నవారని.. కాని తాను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. కెరీర్ మొదట్లో ఫ్లాప్ లు ఎదుర్కొన్నానని.. ధైర్యంతో ముందుకు నడవటం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో తనను విధిరాత ఉంచిందని.. అందుకే విధిరాతను నమ్ముతానని తెలిపింది.