బుట్టబొమ్మ పొట్ట ఉందే ఇంత.. కానీ పూజా హెగ్డే మొత్తం లాగించేసింది!!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ తెలిసిందే. ఎలా పాపులర్ అయింది.. స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. మళ్లీ గ్యాప్ ఇచ్చింది. బాలీవుడ్ వెళ్లి అక్కడ చేతులు కాల్చుకుంది. మళ్లీ డీజే సినిమాతో రీ ఎంట్రీ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. వరుసగా స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

Pooja Hegde Looks like foodie,Pooja Hegde
Pooja Hegde Looks like foodie,Pooja Hegde

సోషల్ మీడియాలోనూ పూజా హెగ్డే దుమ్ములేపుతూ ఉంటుంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఇటలీలో ఉంది. రాధేశ్యామ్ చిత్రం కోసం పూజా హెగ్డే ఈ మధ్యే ఇటలీకి చెక్కేసింది. తన బర్త్ డేకూడా అక్కడే గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. తన టీంతో కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. అయితే పూజా హెగ్డే నేటి వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఓ పోస్ట్ చేసినట్టుంది. ఇక ప్లేట్ నిండా చైనీస్ ఫుడ్ నింపేసినట్టు కనిపిస్తోంది.

Pooja Hegde Looks like foodie,Pooja Hegde
Pooja Hegde Looks like foodie,Pooja Hegde

 

మామూలుగా పూజా హెగ్డే విపరీతమైన వర్కౌట్లు, యోగాసానాలు చేస్తుంటుంది. ఎప్పుడూ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. లాక్ డౌన్‌లో కూడా ప్రత్యేకమైన వంటలు చేసి బాగా లాంగిచినా కూడా వర్కౌట్లు బాగాన చేసింది. తాజాగా ఆమె ప్లేట్ నిండా వాటిని గుటుక్కున మింగేసింది. ఇంకా కావాలి అంటూ అడిగిసేసింది. పూజా హెగ్డే పొట్ట చూస్తే ఉంది కొంచెం అయినా.. ఫుడ్ మాత్రం బాగానే లాగించేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.