మరోసారి నడక నేర్చుకుంటున్న పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న ఫోటోలు!

సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ షూటింగ్‌ సమయంలో ఆమె ఎడమ కాలికి గాయమైంది. దీంతో ఈమె షూటింగ్ కు విరామం ప్రకటించి ఇంటిపట్టునే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇంట్లో చికిత్స తీసుకుంటూ ఉండగా ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె హెల్త్ అప్డేట్ గురించి ఓ విషయాన్ని తెలియజేశారు.

ఈ క్రమంలోనే పూజా హెగ్డే తన కాలికి జరిగిన ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని మెల్లిగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ..నేను నా జీవితంలో రెండోసారి నడక నేర్చుకుంటున్నాను ఇందుకు సంబంధించిన విషయాలను తలచుకుంటే చాలా ఫన్నీగా ఉంది అంటూ రాసుకోచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇక ఈమె సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాలు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగులో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే.