Home News మ‌ళ్ళీ అడ్డంగా బుక్ అయిన పూజా హెగ్డే.. ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్

మ‌ళ్ళీ అడ్డంగా బుక్ అయిన పూజా హెగ్డే.. ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్

త‌న అంద‌చందాల‌తోనే కాక అభిన‌యంతోను ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న మంగ‌ళూరు సోయగం పూజా హెగ్డే. ఇటీవ‌ల ఈ అమ్మ‌డ‌కి వ‌రుస హిట్స్ రావ‌డంతో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ పొందింది. అంతేకాదు ప‌లు క్రేజీ ఆఫ‌ర్స్ కూడా త‌లుపు త‌డుతున్నాయ్. పూజా న‌టించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాలు విడుద‌లకు సిద్ధం కాగా, వాటి కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు పూజా హిందీలోను న‌టించేందుకు సిద్ధం కాగా, ప్ర‌స్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Ntr Pooja | Telugu Rajyam

పూజా హెగ్డే ఇటీవల వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య దక్షిణాది ప్రేక్షకులు కథానాయికల నాభి సౌందర్యానికి దాసోహమవుతారంటూ కామెంట్ చేయ‌డంతో పెద్ద ర‌చ్చ అయింది. ఈ నేపథ్యంలో స్పందించిన పూజా.. . ‘నా మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో కాని అభిమానాన్ని మార్చలేరు అని పేర్కొంది. అంతేకాదు తెలుగు చిత్ర సీమ త‌న‌కు ఎప్ప‌టికీ ప్రాణం అని, అభిమానులు త‌న మ‌న‌సుని అర్ధం చేసుకుంటార‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఆ వివాదం స‌ద్ధుమ‌ణిగింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని ఓ రేంజ్‌లో పైకి లేపి క‌నీసం అల్లు అర్జున్ పేరు కూడా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో మెగా ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఎన్టీఆర్ నా ఎన‌ర్జీకి మ్యాచ్ అయ్యే రేంజ్‌లో ఉంటాడ‌ని, ఆయ‌న‌తో న‌టించడం అనుభూతినిచ్చింద‌ని పేర్కొంది. ఎన్టీఆర్, పూజా హెగ్డే క‌లిసి అర‌వింద స‌మేత చిత్రంలో న‌టించగా, ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. అయితే అల్లు అర్జున్‌తో క‌లిసి డీజే, అల వైకుంఠ‌పురములో చిత్రాలు చేసిన ఈ అమ్మ‌డు క‌నీసం అత‌ని పేరు కూడా ప్ర‌స్తావించ‌కపోవ‌డంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నార‌ట . అయితే చిన్న విష‌యాన్ని కూడా రాద్దాంతం చేయ‌డంపై పూజా హెగ్డే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

 

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News