Home Entertainment బాగా అలిసిపోయినట్టుంది.. పూజా హెగ్డే పిక్ వైరల్

బాగా అలిసిపోయినట్టుంది.. పూజా హెగ్డే పిక్ వైరల్

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒకటి ప్రభాస్ రాధేశ్యామ్ కాగా రెండోది.. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. ఇలా ఈ రెండు సినిమా షూటింగ్‌లతో అటు ఇటు తిరిగేస్తూ ఉంటోంది. ఒక షెడ్యూల్ అక్కడ.. మరో షెడ్యూల్ ఇక్కడ అన్నట్టు బిజీబిజీగా గడిపేస్తోంది. ఇటలీ షెడ్యూల్ పూర్తయ్యాక పూజా హెగ్డే బ్యాచ్‌లర్ షెడ్యూల్‌లో ప్రత్యక్షమైంది. మళ్లీ ఇక్కడ పూర్తవ్వడంతో అక్కడికి చెక్కేసింది.

ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్ సెట్‌లోనే ఉంది. ఈ మధ్యే రాధేశ్యామ్ సినిమా అప్డేట్‌ను దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఇచ్చాడు. దాదాపు వంద రోజుల పాటు వెయ్యి మందికిపైగా ఆర్టిస్ట్‌లు కష్టపడి చేసిన యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయని, అవి నెవ్వరో బిఫోర్ అనేలా ఉన్నాయంటూ డైరెక్టర్ అంచనాలు పెంచేశాడు. అయితే మొత్తానికి రాధేశ్యామ్ సినిమాలో రొమాన్స్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయని చెప్పకనే చెప్పేశాడు.

బాగా అలిసిపోయినట్టుంది.. పూజా హెగ్డే పిక్ వైరల్
Pooja Hegde at Radhe shyam Set on 87th day

తాజాగా పూజా హెగ్డే ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో పూజా క్యూట్‌గా తన మొహాన్ని తిప్పుకుంది. కళ్లు మూసుకుని ఓ ఫోటోను దిగింది. అయితే ఆ ఫోటోకు ఆమె పెట్టిన క్యాప్షన్ బాగుంది. ఓ ఫోటో తీసుకోవాలని ఉంది.. కానీ ఇప్పుడు అంతా తిరుగుతోన్నట్టు అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చింది. అంటే షూటింగ్‌లో బాగానే అలిసిపోయినట్టు కనిపిస్తోంది. రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో అది 87వ రోజు అని .. ప్యాకప్ చెప్పేశామని తెలిపింది. మొత్తానికి పూజా హెగ్డే మాత్రం సోషల్ మీడియాలో ఇలా రచ్చ రచ్చ చేస్తూనే ఉంది.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

బ‌న్నీ సినిమాకు ఈ కుర్ర భామ నో చెప్ప‌డానికి కార‌ణం ఏంటి?

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు హిందీలోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. బ‌న్నీ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని...

మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో...

పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది....

Latest News