” రాధే శ్యామ్ ” నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన టీమ్…!

జిల్ రాధాకృష్ణ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. యువి క్రియేషన్స్ – గోపికృష్ణ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు 7 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత చిత్ర యూనిట్ రీసెంట్ యూరప్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. 15 రోజుల షెడ్యూల్ అనంతరం తిరిగి ఇండియాకి రానున్నారు. కాగా ఇప్పటికే ఈ వరకు ఈ సినిమాలో పూజా హెగ్డే పోషించే పాత్ర గురించి రక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Happy Birthday Pooja Hegde: Prabhas unveils her look from 'Radhe Shyam';  can you spot him too?

పూజా హెగ్డే రాధేశ్యామ్ లో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు అందులో ఒక క్యారెక్టర్ మ్యూజిక్ టీచర్ అన్న ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాని దర్శకుడు రాధాకృష్ణ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక యూరప్ లో చిత్రీకరణ జరుపుతుండగానే రాధేశ్యామ్ యూనిట్ హీరోయిన్ పూజా హెగ్డే స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా తను పోషిస్తున్న క్యారెక్టర్ ఫస్ట్ లుక్ తో పాటు చిత్రంలో పూజా పోషిస్తున్న పాత్ర పేరును రివీల్ చేశారు.

Prabhas Releases Pooja Hegde First Look Poster From 'Radhe Shyam' | The  India Media

“ప్రేరణ” అన్న పాత్రలో పూజా నటిస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ – పూజా హెగ్డే కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక త్వరలో ఇండియాకి తిరిగొచ్చాక రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మిగతా టాకీపార్ట్ ని కంప్లీట్ చేయనున్నారట.