బాక్సాఫీస్ : భారీ వసూళ్లతో “పొన్నియిన్ సెల్వన్ 2”.!

గత ఏడాది ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ అయ్యిన చిత్రాల్లో తమిళ సినిమా నుంచే ఏకంగా రెండు ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. కాగా ఈ చిత్రాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన చిత్రం “విక్రమ్” ఒకటి కాగా దీని తర్వాత వచ్చిన భారీ మల్టీ స్టారర్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించగా విక్రమ్, కార్తీ తదితరులు నటించగా ఐశ్వర్య రాయ్ మరియు త్రిష లు ఈ సినిమాలో నటించారు. మరి ఈ సినిమా అయితే గత ఏడాది సెన్సేషనల్ హిట్ గా 600 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత సీక్వెల్ ఇప్పుడు రిలీజ్ కాగా ఈ సినిమా కూడా రికార్డు వసూళ్లు రాబడుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే డే 1 కి 60 కోట్లే రాబట్టగా రెండో రోజు 40 కోట్లకి పైగా రాబట్టి రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని ఈ చిత్రం కొట్టేసింది. ఇక ముఖ్యంగా అయితే యూఎస్ లో రికార్డ్ వసూళ్లు కొల్లగొడుతుంది. మరి అక్కడైతే జస్ట్ రెండు రోజుల్లోనే 3 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా పొన్నియిన్ సెల్వన్ 2 సత్తా చాటుతుందట. దీనితో ఈ సినిమా కూడా అదిరే వసూళ్లు ఫైనల్ రన్ లో రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. మరి ఈ చిత్రం 600కోట్లకి పైగా రాబడుతుందో లేదో చూడాలి.