ఇండియన్ సినిమా దగ్గర ఒకప్పుడు అయితే సీక్వెల్ సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి గాని మార్కెట్ గాని ఉండేది కాదు. దీనితో సీక్వెల్స్ చేయడానికి చాలా మంది భయపడ్డారు. కానీ టాలీవుడ్ నుంచి బాహుబలి 2 వచ్చాక ఇండియన్ సినిమా నుంచి సీక్వెల్స్ ని ఓ రేంజ్ లో తీసుకొచ్చేలా చేసింది.
ఎన్నో చిత్రాలకి లెజెండరీ దర్శకులకి రాజమౌళి సీక్వెల్స్ చేసేలా హోప్ ఇచ్చాడు. అలా అక్కడ నుంచి వచ్చిన చాలా సీక్వెల్స్ బాగానే ఆడాయి. కానీ అనూహ్యంగా తమిళ్ నుంచి వచ్చిన ఓ సీక్వెల్ పరిస్థితి ఊహించని రకంగా మారింది. వారి రాష్ట్ర చరిత్రని మణిరత్నం భారీ తారాగణంతో చేసారు.
ఫస్ట్ పార్ట్ భారీ హిట్ అయ్యింది కానీ ఒక్క తమిళ్ లో మాత్రమే హిట్ అయ్యింది. అయినాయి కూడా మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లోనే సీక్వెల్ ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇంట్రెస్టింగ్ గా మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయి కానీ మొదటి భాగంతో పోలిస్తే అంతగా రాలేదు.
ఇక మరీ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే తమిళనాడులో కూడా పార్ట్ 1 ని మించి ఏ రోజు పార్ట్ 2 కి వసూళ్లు రాలేదు. ఇదే తరహాలో ఓవర్సీస్ లో కూడా నడుస్తుంది. అయితే మొదటి వారం 200 కోట్లు చేరడానికి పెద్దగా సమయం తీసుకోలేదు కానీ ఇప్పుడు తమిళ ఆడియెన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరచట్లేదు.
దీనితో ఈ సినిమా వసూళ్లు పార్ట్ 1 కి వచ్చిన రేంజ్ లో రాకపోగా ఇంకా తక్కువ స్థాయిలో వచ్చిన పలు సీక్వెల్స్ కి అయితే డే 1 నుంచే మొదటి భాగం కన్నా భారీ మార్జిన్ వసూళ్లు రిజిస్టర్ అయ్యాయి. కానీ ఇంట్రెస్టింగ్ గా పొన్నియిన్ సెల్వన్ 2 కి మాత్రం అంతా రివర్స్ లో పోతుండడం గమనార్హం.