విజయ్ ఆడియోకి పొలిటికల్ చిక్కులు??

సౌత్ ఇండియా సినిమా దగ్గర అందులోని తమిళ సినిమా నుంచి భారీ హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం “లియో” అని చెప్పడంలో డౌట్ లేదు. కాగా ఈ చిత్రం రిలీజ్ ఇప్పుడు దగ్గరకి వస్తుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ కాస్టింగ్ తో మెయిన్ గా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని అయితే దీనిపై ఇన్ని అంచనాలు నెలకొన్నాయి.

సో ఇలా లియో పై రెగ్యులర్ గా విజయ్ నుంచి వచ్చే సినిమాల కంటే ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా మన దగ్గరలా కాకుండా తమిళ నాట ఇంకా ఆడియో లాంచ్ లే నిర్వహిస్తారు. అలా లియో కి కూడా భారీ ఈవెంట్ ని నిర్మాతలు ప్లాన్ చేయగా నిన్న షాకింగ్ అప్డేట్ ఈ లాంచ్ ఆపేసినట్టుగా తెలిపారు.

దీనితో విజయ్ అభిమానులు ఒక్కసారిగా డిజప్పాయింట్ అవ్వగా దీనికి వారు చెప్పిన కారణం కూడా చర్చగా మారింది. మొదట అయితే పాస్ లు లేవు జనం అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తున్నారు అని అందుకే ఆపమని చెప్పారు. కానీ లాస్ట్ లైన్ లో ఇందుకు ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు అందరూ గమనించాలి అంటూ నోట్ చేశారు. దీనితో ఈ కారణాలు చాలా మందికి సిల్లీగా అనిపిస్తున్నాయి.

ఏ స్టార్ హీరో వేడుక అయినా జనం అనుకున్న దానికంటే ఎక్కువే వస్తారు దానిని సాకుగా చెప్పడం కరెక్ట్ గా లేదని కొందరు అంటున్నారు. అయితే విజయ్ రీసెంట్ గానే రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా చెప్పిన సంగతి తెలిసిందే. మరి దానితో ఏమన్నా లింక్ ఉందా అని కొంతమంది అనుకుంటున్నారు. దీనితో ఇప్పుడు లియో ఆడియో వేడుక సస్పెన్స్ గా మారింది. 
https://x.com/7screenstudio/status/1706711608150704294?s=20