Pushpa 2: ఒకరోజు ముందే ‘పుష్పా2’ విడుదలకు ప్లాన్‌!

Pushpa 2: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పుష్ప 2 ది రూల్‌’ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్న వారందరికీ ఓ గుడ్‌ న్యూస్‌. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ చిత్రం ప్రకటించిన డేట్‌ కంటే ఒకరోజు ముందుగానే విడుదల కానుందని తెలుస్తోంది.

Pushpa 2: పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ పుష్పరాజ్‌ పోస్టర్‌తో అప్‌డేట్‌ వదిలిన మేకర్స్‌ డిసెంబరు 6

డిసెంబర్‌ 5 రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి గురువారం నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. గురువారం హైదరాబాద్‌లో ‘పుష్ప 2 ది రూల్‌’ విూడియా సమావేశం గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ సమావేశంలో ఈ సినిమా విడుదలకు సంబంధించిన మేకర్స్‌ ఒక రోజు ముందుగానే అనే ప్రకటన చేయబోతున్నారనేది లేటేస్ట్‌ అప్డేట్‌.

ఈ విూడియా సమావేశానికి మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్స్‌తో పాటు, హిందీ వెర్షన్‌ను విడుదల చేస్తున్న అనిల్‌ తడానీ, తమిళ్‌ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తోన్న ఎజిఎస్‌ సంస్థ ప్రతినిధులు, డిస్టిబ్యూట్రర్స్‌ హాజరుకానున్నారనేది తాజా సమాచారం.

Director Geetha Krishna About K. Viswanath and NTR || Geetha Krishna Latest Interview || TR