ఫినానిమల్ “జవాన్”..ఒక్క రోజులో ఇదేం రికార్డు సామీ..!

Jawan Movie

ఒక స్టార్ హీరోకి కం బ్యాక్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఈ ఏడాదిలో చాలా సినిమాలు చూపించాయి. అయితే ఇలాంటి కం బ్యాక్ లకే బాప్ అన్నట్టుగా ఇచ్చిన కం బ్యాక్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇచ్చిన కం బ్యాక్ అని చెప్పాలి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన పఠాన్ సినిమాతో కనీ వినీ ఎరుగని రీతి భారీ రికార్డులు సెట్ చేసిన తాను..

బాలీవుడ్ కి సరికొత్త లెక్కలు సెట్ చేసి బాలీవుడ్ ని కూడా మళ్ళీ వసూళ్ల వర్షంతో నిద్ర లేపి ప్రేక్షకులని థియేటర్స్ కి పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక ఈ సినిమా అయ్యాక వచ్చిన తదుపరి సినిమానే “జవాన్”. దీనికీ పాజిటివ్ టాక్ వచ్చింది. పైగా ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపించాడు.

సో ఇక ఏమవుతుంది? ఇంపాక్ట్ డబుల్ అయ్యింది. దీనితో కింగ్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర విరుచుకుపడ్డాడు. ఇది ఏ లెవెల్లో ఉందంటే ఓవర్సీస్ మార్కెట్ లో ఇండియన్ సినిమా నుంచి ఏ ఒక్క సినిమా ఎలాంటి పాన్ ఇండియా సినిమా ఏ భాష నుంచి కూడా అందుకోని ఫినానిమల్ రికార్డుని అందుకుంది.

జస్ట్ ఒక్క రోజులోనే 7 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని ఈ చిత్రం కొల్లగొట్టింది. దెబ్బకి ఈ లెక్కలు చూసే ట్రేడ్ వర్గాలు షాకవుతూ షారుఖ్ బాక్సాఫీస్ పవర్ కి సలాం అంటున్నారు. దీనితో ఆదివారం వసూళ్లు మరో లెవెల్లో ఉంటాయని అంటున్నారు. మొత్తానికి అయితే సౌత్ నుంచి వెళ్లిన దర్శకుడు అట్లీతో చేసిన ఈ సినిమా మైండ్ బ్లాకింగ్ గా రన్ ని అందుకుంటుంది అని చెప్పాలి.