ఎమోషనల్ బోల్డ్ పోస్టర్ తో షాకిచ్చిన పాయల్ రాజ్ పుత్.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ యంగ్ హీరోయిన్స్ లో తన మొదటి సినిమాతోనే అపారమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఒకామె. అయితే తన మొదటి సినిమా “ఆర్ ఎక్స్ 100” లోనే ఒక కంప్లీట్ బోల్డ్ రోల్ లో కనిపించిన తాను తర్వాత కూడా కొన్ని ఆ తరహా రోల్స్ చేసింది కానీ అవి అంత సక్సెస్ కాలేదు.

ప్రస్తుతానికి తన సినిమాలు కూడా సక్సెస్ రేట్ తక్కువే ఉన్నాయి కానీ మంచి టాలెంట్ కలిగిన నటి తాను. కాగా తన మొదటి సినిమా దర్శకుడు అజయ్ భూపతి తోనే ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్న సినిమానే “మంగళవారం”. మరి దీని నుంచి మేకర్స్ అయితే ఈరోజు ఓ ఊహించని పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు.

ఇంట్రెస్టింగ్ గా ఈ పోస్టర్ లో పాయల్ రాజ్ పుత్ టాప్ లెస్ గా కనిపించి షాకిచ్చింది. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అయితే అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా 1990 నేపథ్యంలో కనిపించే కథలా ఉంటుందట. మరి ఫస్ట్ పోస్టర్ తోనే ఈ రేంజ్ బోల్డ్ అటెంప్ట్ చేసిన తాను సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

ఇప్పటికే ఈ కాంబో పై మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ ని ఇంకా బాగా గమనిస్తే ఆమె ఒంటిపై ఎలాంటి బట్టలు లేవు కానీ కంట్లో కన్నీళ్లు ఏదో బాధ కనిపిస్తుంది. దీనితో కంటెంట్ ఏదో బలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి అజయ్ భూపతి అయితే ఏం చేస్తాడో చూడాలి.