Bigg Boss 4 Telugu: చీ చీ దారుణంగా తిట్టాడు.. హుందాగా స్పందించిన పాయల్

Payal Rajput Reaction On Negative Comment

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. పాయల్ ఎంతగా హల్చల్ చేస్తుందో.. అంత నెగెటివిటీ కూడా వస్తూ ఉంటుంది. పాయల్ విషయంలోనే ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. ఆ మధ్య కరోనా టెస్ట్ చేయించుకున్నప్పుడు అరవడం పైనా పాయల్‌ను నెటిజన్లు ఏకిపారేశారు. ఆ విషయంలోనూ తనపై ట్రోలింగ్ జరగడంతో పాయల్ హర్ట్ అయింది.

Payal Rajput Reaction On Negative Comment
Payal Rajput Reaction On Negative Comment

నాకు భయమే ఏడిస్తే కూడా ట్రోలింగ్ చేయాలా. దాన్ని కూడా నెగెటివ్‌గానే చూస్తారా? కొందరికి సూదులు ఇంజక్షన్లంటే భయమంటూ చెప్పుకొచ్చింది. నాకు అలాంటి భయమే ఉంది. దాన్ని కూడా మీరు ఇలా ట్రోల్ చేస్తారా? అని ఫీలైంది. అయితే తాజాగా పాయల్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో వల్గారిటీ ఏమీ లేదు. కానీ ఓ నెటిజన్ మాత్రం తన నోటికి వచ్చినట్టు తిట్టేశాడు. అది రాయడానికి వీలు కూడా కాదు.

Payal Rajput Reaction On Negative Comment
Payal Rajput Reaction On Negative Comment

పాయల్‌ను అంత మాట అన్నాకూడా చూసి ఏమీ అనలేదు. హుందాగా స్పందించింది. నీ సంస్కారానికి ఓ దండం అన్నట్టుగా వదిలేసింది. ఓ దండం పెట్టి ధన్యావాదాలు అని చెప్పుదెబ్బ కొట్టినట్టు చెప్పేసింది. మొత్తానికి పాయల్ స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పాయల్ ప్రస్తుతం అనగనగా ఓ అతిథి అనే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. లాక్డౌన్ తరువాత తన సినిమా రిలీజ్ అవుతుండటంతో ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తోంది.