విస్కీ తాగండి చెబుతోంది.. మందు సీసాతో పాయల్ రాజ్‌పుత్ రచ్చ

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అంతే బోల్డ్ అని నిరూపించుకుంటుంది. సోషల్ మీడియాలో పాయల్ షేర్ చేసే ఫోటోలు ఎంతగా కాకరేపుతుంటాయో అందరికీ తెలిసిందే. పాయల్ చేసే ఫోటో షూట్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. లాక్డౌన్‌లో పాయల్ చేసిన వింత చాలెంజ్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Payal Rajput Promotes Royal Challenge Whiskey
Payal Rajput Promotes Royal Challenge Whiskey

పాయల్ ప్రస్తుతం హైద్రాబాద్‌లోనే ఉంటూ తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటూ భాషపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. పాయల్ ప్రస్తుతం అనగనగా ఓ అతిథి అనే మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో పాయల్ నటన, బోల్డ్ డైలాగ్‌లు తెగ వైరల్ అయ్యాయి. పాయల్ ప్రస్తుతం ఓ యాడ్ చేసింది.

Payal Rajput Promotes Royal Challenge Whiskey
Payal Rajput Promotes Royal Challenge Whiskey

రాయల్ ఛాలెంజ్ విస్కీ కోసం పాయల్ ఓ యాడ్‌లో నటించింది. స్మూతర్ రిచర్ రాయల్ చాలెంజ్ ఇకపై తెలంగాణలో లభ్యమవుతోందని చెబుతూ అందరూ తాగాలని పాయల్ పరోక్షంగా చెప్పింది. పాయల్ తన చేతిలో మందు గ్లాసు పట్టుకుని అదిరిపోయే పోజు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి వాటికి ఎందుకు ప్రమోషన్స్ కలిపిస్తారు.. డబ్బుల కోసమే అయితే వేరే ఉత్పత్తుల యాడ్స్‌లో నటించొచ్చు కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.