పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఎంత ఘాటుగా కనిపిస్తుందో సోషల్ మీడియాలో అంతకు పదింతలు ఘటుగా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో, వెరైటీ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అందుకే ఈ మధ్య సినిమా లేవీ లేకపోయినా, హిట్ కాకపోయినా పాయల్ పేరు మాత్రం తెగ వైరల్ అయింది. పాయల్ సోషల్ మీడియాలో చేసే రచ్చతోనే ఇంకా క్రేజ్ తెచ్చుకుంటోంది.
పాయల్ ఈ మధ్య హైద్రాబాద్‌కు మకాం మార్చిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రాజెక్ట్‌లు చేతినిండా ఉండటం, అవి హైద్రాబాద్‌లో షూట్ జరుగుతుండటంతో ఇక్కడే ఓ ఇళ్లు కొనుక్కుని సెటిలైంది. ఈ మేరకు ఇంటికి కావాల్సిన సామాగ్రిని కొనడానికి వెళ్తే అందరూ చుట్టుముట్టారని, అందుకే అన్నీ ఆన్ లైన్‌లోనే కొన్నానని తన పాపులార్టీ గురించి చెప్పకనే చెప్పేసింది. తాజాగా పాయల్ తన మేకప్ రూంలోని సంగతులను చెప్పింది.
పాయల్ ప్రస్తుతం ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉంది. అందులో పక్కా తెలుగమ్మాయిలా, పల్లెటూరి పిల్ల పాత్రను పోషిస్తోంది. ఆ మధ్య ఆమె పాత్రకు సంబంధించిన స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. తాజాగా మేకప్ రూంలో రెడీ అవుతున్న వీడియోను షేర్ చేసింది. అయితే జడనిండా పూలు పెట్టుకుని ఉండటం, ఎలా కనిపిస్తున్నానని అందర్నీ ఆడిగింది. ఇక పూలు ఎందుకు పెట్టుకున్నావ్ అంటే.. సౌత్ ఇండియన్ కల్చర్.. తెలుగమ్మాయిలా మారిపోయాను అంటూ నవ్వేసింది.