పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులు చూపించిన అభిమానానికి పాయల్ ఎప్పుడూ కృతజ్ఞతాభావంతోనే ఉంటుంది. సొంత పంజాబీ ఇండస్ట్రీ కంటే తెలుగు చిత్రసీమ మీదే తన ఇష్టాన్ని చాటుతుంది. అది మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపెడుతోంది. తెలుగు తెరకు పరిచయమై రెండేళ్లు అయిందో లేదో తెలుగు భాషపై ప్రేమను పెంచుకుంది. మొదటి సారి తెలుగులో డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకుంది.
తెలుగు తెరపై దశాబ్దంపైగా స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పిన శ్రియా, కాజల్, త్రిష,ఇలియానా ఇలా ఎంతో హీరోయిన్ల కంటే పాయల్ వంద రెట్టు బెటర్. వారెప్పుడు టాలీవుడ్‌ను కమర్షియల్ యాంగిల్‌లోనే చూశారు. గానీ మన ప్రేక్షకులను ఏనాడు వారు గుర్తించలేదు. కానీ పాయల్ ఇక్కడే ఇళ్లు కొనుక్కుని, తెలుగు నేర్చుకునేందుకు పాట్లు పడుతోంది. పైగా మొదటి సారి ఓ ప్రకటన కోసం తన గొంతును వినిపించింది.
ప్లాస్మా దానంపై అవగాహన కలిగించే కార్యక్రమం కోసం ఓ షార్ట్ ఫిలింను రూపొందించారు. ఇందులో పాయల్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొచ్చింది. ప్లాస్మా దానం చేసేందుకు ఇక్కడకు వచ్చాను.. పోలీస్ హెల్ప్ లైన్ సాయం తీసుకుని వచ్చాను.. ప్లాస్మా దానం చేస్తే ఏమైనా అవుతుందా?.. అంటూ ముద్దు ముద్దుగా పాయల్ మాట్లాడిన మాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సినిమాల్లోనూ పాయల్ తన గొంతును వినిపించొచ్చు.