ఆ ఫోటోను చూసి షాక్.. పగలబడి నవ్వుతోన్న పాయల్ రాజ్‌పుత్

పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమాతో సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా ఇందు పాత్ర చేసిన మాయాజాలాన్ని ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. ఇందు పాత్ర చేసిన మోసాన్ని, ఆమె పాత్రలో జీవించిన పాయల్ రాజ్‌పుత్‌ను ఎవ్వరూ మరిచిపోలేదు. తాజాగా ఓ ఫోటోను చూసి పాయల్ తెగ నవ్వేసింది. ఆర్ ఎక్స్ 100 సినిమాలో అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడ మొదలైందో అందరికీ గుర్తుండే ఉంటుంది.

Payal rajput About Meme On RX 100
Payal rajput About Meme On RX 100

ఎన్నికల్లో గెలిచాక ఊరేగింపులో వస్తోన్న హీరో షర్ట్ విప్పేసి డ్యాన్సులు చేయడం అక్కడ అతని సిక్స్ ప్యాక్ బాడీ చూసి హీరోయిన్ మోహించడంతో కథ మొదలవుతుంది. ఆ విషయాన్ని మనకు చివరగా రివీల్ చేస్తారు. అలా సిక్స్ ప్యాక్ బాడీని చూసి టెంప్ట్ అయిన హీరోయిన్ అతడిని వల్లో వేసుకుంటుంది. అయితే ఇక్కడ హీరో ఇంకోలా ఉంటే కథ వేరేలా ఉండేది. ఈ విషయంపైనే ఓ మీమ్ తాజాగా వైరల్ అయింది.

Payal rajput About Meme On RX 100
Payal rajput About Meme On RX 100

అది చివరకు పాయల్ కంటపడినట్టుంది. ఆ మీమ్‌లో కార్తికేయకు పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఉంది. అలా ఉంటే అసలు ఇందు మోసం చేసేది కాదు.. అసలు అక్కడితే కథ ముగిసేది అంటూ ఓ మీమ్ తెగ హల్చల్ చేస్తోంది. ఆ మీమ్‌పై పాయల్ స్పందిస్తూ.. నవ్వు ఆపుకోలేకపోతోన్నా అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. పాయల్ ప్రస్తుతం హైద్రాబాద్‌కే మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బిగ్ బాస్ స్టేజ్ మీద హాట్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది.