ఆ సినిమా కోసం ఆలోచిస్తున్న పవన్.?

hariharaveeramallu-teaser-date-1024x768

ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలతో పాటుగా తన రాజకీయ యాత్రలో కూడా యమ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ బిజీ లో అయితే పవన్ సినిమాలు షూటింగ్స్ అందాకా ఆపాలని చూస్తున్నట్టుగా పలు రూమర్స్ కూడా వచ్చాయి.

కాగా ఈ చిత్రాల్లో అయితే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసి సగానికి పైగా కంప్లీట్ అయ్యిన సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రం పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అండ్ స్పాన్ తో అయితే తెరకెక్కుతుంది. ఇక ఈ భారీ చిత్రంని ఇప్పటికే బాగా ఆలస్యం చేస్తూ వచ్చిన పవన్  ఫైనల్ గా ఈ సినిమాపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మిగతా సినిమాలకి అఫీషియల్ గా బ్రేక్ ఇచ్చినప్పటికీ పవన్ నటించిన ఈ సినిమా బాగా ఆలస్యం అవుతుండడంతో పవన్ తన టూర్ లోనే ఏదో ఒక సమయం చూసుకొని అయితే కొన్ని రోజులు కాల్షీట్స్ కేటాయించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనితో దాదాపు 4 నెలలకి పైగా ఆగిపోయిన షూటింగ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ కానుంది అని చెప్పాలి.

కాగా ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నుంచి కూడా పలువురు స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.