గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయి అనేది ఎవరికీ తెలీదు. అంతెందుకు తనకే పెద్దగా క్లారిటీ ఉండదు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సడెన్ గా పాలిటిక్స్ లో బయటకి రాకుండా సినిమాలు ఓ రేంజ్ లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
మరి పవన్ ఇప్పుడు రీమేక్ చిత్రం వినోదయ సీతం లో బిజీగా ఉండగా లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ సినిమా తర్వాత ఇమీడియెట్ గా సుజీత్ తో ఓజి అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పవన్ స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలు లైన్ లోకి వస్తే ఆ అసలు సినిమా సంగతి ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరి ఆ సినిమా ఎదో కూడా కాదు దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమానే. అయితే ఈ సినిమా ఇప్పుడు అంతకంతకు వెనక్కి వెళ్తుందట. ఇప్పుడు పవన్ లుక్ మార్చివేయడం అలాగే మరోపక్క కొత్త సినిమాలు ఓకే చేసి వాటికే డేట్స్ ఇస్తుండడం తో హరి హర వీరమల్లు సినిమా అయితే ఇంకో మూడు నెలల వరకు మొదలయ్యే సూచనలు లేవని సినీ వర్గాల వారు అంటున్నారు.
మొత్తానికి అయితే ఇప్పుడు ఈ సినిమాని అందాకా పక్కన పెట్టేసినట్టే అని చెప్పాలి. కాగా ఈ భారీ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అన్నీ సెట్టయ్యినట్టు అయితే ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది లేకపోతె ఇక వచ్చే ఏడాది లోనే ఈ రిలీజ్ ఉంటుంది.