పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే జనసేనని పవన్ కళ్యాాణ్ 2024 ఎన్నికల్లో ఎలా అయినా ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన… కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని ఇప్పటికే ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు పెట్టుకుంటారా? లేదా అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతానికి బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తులోనే ఉన్నా… ఆయన కచ్చితంగా ఏ పార్టీతో ముందుకు వెళతారు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే ఎన్నికలు మరో ఏడాది కాలంలో జరగబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసి ముందుకు వెళతారు అనే విషయం మీద క్లారిటీ లేకపోయినా ఎన్నికల్లో బిజీ అయ్యేవరకు వీలైనంత సంపాదించుకునే పనిలో ఆయన పడ్డారని అంటున్నారు.
ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే క్రిస్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అలాగే.. సముద్రఖని దర్శకత్వంలో తమిళ వినోదయ సిత్తం సినిమా రీమేక్ చేస్తున్నారు. ఇక ఆయన రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అదేమిటంటే పవన్ కళ్యాణ్ రోజుకి మూడు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమరంలోకి పూర్తిస్థాయిలో దిగే లోపు వీలైనంత డబ్బు సంపాదించుకుని ఆ డబ్బు జనసేన పార్టీని నడిపించడానికి ఉపయోగించాలని ఆయన భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి మూడు సినిమాలుకు డేట్స్ ఇచ్చి అన్నింటినీ సమాంతరంగా పూర్తి చేసే పనిలో పడ్డారని అంటున్నారు.
ఇప్పటికే ఆయన పార్ట్ టైం పొలిటిషియన్ అనే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలను దూరం చేసుకునేందుకు ఆయన పూర్తిస్థాయిలో సినిమాలు పూర్తిచేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయం మీద ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఏం జరగబోతోంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎలా బిజీ అవ్వబోతున్నారు అనేది. చూడాలి ఇక ఎలక్షన్స్‌లో పవన్ చక్రం తిప్పుతారో లేదో అని.