పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా హరిహర వీర మల్లు గురించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న పవన్, ఈ సినిమాకి కేవలం రూ.11 కోట్లు మాత్రమే తీసుకున్నారని సమాచారం. షూటింగ్ ప్రారంభానికి ముందు రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న పవన్, షెడ్యూల్ పొడిగించడంతో మరో కోటీ చెల్లించారట. ఇది చాలా తక్కువ అని సినీ నిపుణులే చెబుతున్నారు.
తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలను డిమాండ్ చేయకపోవడమే కాకుండా, సహకరించడం పవన్ వైఖరి గొప్పదిగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ప్రస్తుతం ప్రభుత్వ పదవిలో ఉన్న నేపథ్యంలో, సినిమాల్లో కొత్తగా అడుగుపెడుతున్న నిర్మాతలకు భారం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, ఇది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు బీజం పడినట్లే.
ఇక నిర్మాతలతో పారదర్శక లాభాల్లో భాగస్వామ్యం కూడా పవన్ ఒప్పుకున్నట్టు టాక్. అంటే, సినిమా హిట్టయితే లాభాల్లో వాటా.. ఫలితం లేకపోతే రెమ్యునరేషన్ పరిమితంగా ఉండే విధానం. ఇది స్టార్ హీరోల రెమ్యునరేషన్ వ్యవహారంపై వస్తున్న విమర్శలకు సమాధానంగా మారనుంది. హరిహర వీర మల్లు జూన్‌లో థియేటర్లకు రానుండగా, ఈ సినిమా విజయంతో పవన్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి మార్గదర్శకంగా నిలవబోతుందని సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.